స్వర్గీయ శ్రీ జావేద్ అబిదీ (53),

  భారతదేశములో మొట్టమొదటిగా సకల వికలాంగుల హక్కుల చట్టాల (1995, 2016)సాధకుడు, భారతదేశ అన్ని రకాల వికలాంగుల ఐఖ్య ఉద్యమ జాతిపిత, దేశంలోని ప్రభుత్వ జాతీయ విధానాలను వికలాంగులకు అనుకూలంగా మార్పును సాధించిన గొప్ప పొరాట యోధుడు, తనకంటూ స్వంత జీవితం లేని ఆయన ఒంటరి జీవితమంతా ప్రపంచ దేశాల వికలాంగులకు అంకితం చేసిన త్యాగశీలి. ప్రపంచ మానవహక్కులో వికలాంగులకు సమానావకాశాలకై నిరంతర పోరాటంలో ఆయన దేశ దేశాలు, ఖండాలు మారుమూల ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ అనారోగ్యాన్ని లెక్కచేయలేదు.

  తీవ్ర అనారోగ్యముతో కూడా అంతర్జాతీయ సమావేశాలను ఢిల్లీలో నిర్వహిస్తూ మన భారత దేశానికి మన ఆసియా ఖండానికి పేరు ప్రతిష్టలు తెచ్చారు.

  జాతీయ స్థాయిలో ఆయన వ్యూహాత్మక ఉద్యమాలతో సాధించిన అపూర్వ విజయాలు కొన్ని:

  1995 చట్టం ఆమోదం, 2001 జనాభా లెక్కింపులో వికలాంగుల చేర్పు, ప్రజా స్థలాల్లో, పార్కుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగులకు అనుకూల వాతావరణం, 2004 ఎన్నికల కమీషనుతో పోరాడి అనుకూల పోలింగ్ బూతులు, 2012 పంచవర్ష ప్రణాళిక సంఘం కార్యక్రమాల్లో వికలాంగుల అంశాలు చేర్పు, అన్ని విశ్వవిద్యాలయాల్లో వికలాంగుల అంశాలపై అధ్యయనం చేసి UGC లో వికలాంగులకు ప్రత్యేక నిధులు పథకాలు ఏర్పాటు, రైళ్లలో విమానాల్లో గౌరవమైన అనుకూల వాతావరణం, భారత ప్రభుత్వ భవనాల నిర్మాణ నియమాల్లో వికలాంగుల అనుకూలతపై అంశాలు చేర్పు, భారత దేశ బడ్జెట్లో వికలాంగుల ప్రస్తావన ప్రత్యేక పథకాలను PF చెల్లింపు, ఆరోగ్యభీమ పథకాల చేర్పు, IAS, సివిల్స్ లో వికలాంగులకు రిజర్వేషను, 2007 లో ఐక్యరాజ్య సమితి వికలాంగుల హక్కుల ఒప్పందానికి భారత ప్రభుత్వ ఆమోదం, నిరంతరం దశాబ్దాల పోరాటంతో 2016 హక్కుల చట్ట ఆమోదం ఆయన సాధించిన ఫలితాలే.

  వికలాంగుల జాతీయ సమావేశాలు ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో ఆర్భాటంగా స్టార్ హోటల్లో వికలాంగులు గర్వించేలా హుందాగా నిర్వహించే వారు.

  ప్రపంచ స్థాయి సమావేశాన్ని కూడా ఢిల్లీలో నిర్వహించి ప్రపంచ వికలాంగుల చరిత్రలో మన భారత దేశానికి గొప్ప పెరు తెచ్చారు.

  World change makers ప్రపంచ స్థాయిలో మార్పుకు కృషి చేసిన వ్యక్తుల్లో ఆయన ఒకరని జావేద్ అబిది చరిత్ర ప్రచురించారు.

  ఆయన చివరి కోరిక ప్రపంచస్థాయి పనుల్ని తగ్గించి గ్రామీణ భారతంలో పని చేయాలని, కొత్త చట్టము అన్ని హక్కులూ 21 రకాల వికలాంగుల కుటుంబాలకు అదేవిధంగా జిల్లా, తాలూకా గ్రామ స్థాయిలో నాయకత్వాన్ని పెంచి చైతన్యము తేవాలని కుగ్రామనుండి ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని ఉండే. కానీ ఆ బాధ్యత మనపై వేసి మనల్ని వీడి పోయి స.ము దాటింది.

  ప్రపంచ వికలాంగుల చరిత్రలోనే ఎన్నో అభివృద్ధి దేశాలతో పోరాడి పేదరికం ఉన్న ఆసియా దేశాలకు నాయకత్వం ఉండాలని పోరాడి... పోరాడి జావేద్ అబిదీ ప్రపంచ వికలాంగుల సంఘానికి అధ్యక్షుడిగా రెండు సార్లు ఎన్నికయ్యారు. ఆయన చివరి తుది శ్వాస రోజున కూడా అత్యున్నత ప్రపంచ అధ్యక్షునిగా కొనసాగుతున్నాడు.

  వికలాంగుల వ్యవస్థకె ఒక చరిత్ర సృష్టించాడు. అమర్ హై అమర్ హై అనే నినాదం కంటే ఆయన చివరి కోరిక నూతన 2016 చట్టం 21 రకాల వికలాంగులకు అన్ని హక్కులు గ్రామస్థాయిలో అందాలనే కోరిక సఫలంకై నా వంతు కృషి చేస్తాను.

  జావేద్ అబిది నాకు అంబేత్కర్, గాంధీ, పటేల్, నేతాజీలతో సమానం.

  ఆయనతో కలిసి పని చేసిన అనుభవాన్ని, అదృష్టాన్ని నా జీవితంలో మరువలేను.

  ఆయనపై అభిమానముతో త్వరలో JAVAB APPlication, YouTube chanal వికలాంగుల కోసమే తెలుగులో అవిష్కరిస్తాను. ఆయన స్మారకంగా అన్నీ చట్టాల వివరాలు, GOs, తెలుగులో మారుముల గ్రామాలకు అందిస్తాను. మీ సహాకారముతో గ్రామ స్థాయిలో 1000 మంది జర్నలిస్ట్లుగా తయారు చేస్తాను.

  అయన గొప్పతనము గురించి google లో చదవండి

  #javedabidi #ncpedp #dpindia #rpwdact

   

  🙏🏾 మీ సేవలో

  శ్రీనివాసులు M

  Scroll To Top